COVID19: 18 రోజుల్లోనే 40 లక్షల మందికి.. అత్యంత వేగంగా కరోనా టీకాలు వేసిన దేశంగా భారత్​ రికార్డ్​!

45 percent of health workers vaccinated in 18 days India fastest to reach 4m mark
షార్ట్స్‌లో చూడండి
దేశవ్యాప్తంగా 47 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా టీకాలు వేశారు. బుధవారం మొత్తంగా 2,48,662 మంది టీకాలు వేయించుకున్నారు. దీంతో మొత్తంగా టీకా తీసుకున్న వారి సంఖ్య 44 లక్షలు దాటింది. ఇప్పటిదాకా కరోనా టీకాల కోసం 92,61,227 మంది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది నమోదు చేసుకున్నారు.

అయితే, అత్యంత వేగంగా నాలుగు మిలియన్ల (40 లక్షల) మందికి టీకాలు వేసిన దేశంగా భారత్ నిలిచింది. కేవలం 18 రోజుల్లోనే ఆ మార్క్ ను దాటి ప్రథమ స్థానంలో నిలిచింది. మంగళవారం (ఫిబ్రవరి 2) నాటికే భారత్ ఆ ఫీట్ ను సాధించింది. ఈ జాబితాలో అమెరికా రెండో స్థానాన్ని సాధించింది. ఆ దేశం 20 రోజుల్లో 40 లక్షల మందికి కరోనా టీకాలు వేసింది. బ్రిటన్, ఇజ్రాయెల్ లకు 39 రోజుల సమయం పట్టింది.

ఎక్కువ మంది లబ్ధిదారులున్న రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ 69.4 శాతం మందికి టీకాలు వేసి ప్రథమ స్థానాన్ని సాధించింది. ఆ తర్వాత 64.7 శాతంతో రాజస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. సంఖ్యా పరంగా చూస్తే మాత్రం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం 4.63 లక్షల మందికి కరోనా టీకాలు వేసింది. మొత్తం 9 లక్షల మంది ఆరోగ్య సిబ్బంది ఉండగా.. అందులో 51 శాతం మంది టీకాలు తీసుకున్నారు.

మహారాష్ట్రలో కేవలం 34 శాతం మందికే టీకాలు వేశారు. ఛత్తీస్ గఢ్ లో29 శాతం, గోవా 28.3 శాతం, ఢిల్లీ 26.6%, తమిళనాడులో 22.6%, పుదుచ్చేరిలో 12.3% మందే టీకాలు తీసుకున్నారు. ఇక, ఇప్పటిదాకా మణిపూర్ లో అతి తక్కువగా 10 శాతం మందికే టీకాలు వేశారు.
Go Back to Shorts
COVID19
COVAXIN
Covishield

More Telugu News