Corona Virus: దేశంలో క‌రోనా కేసుల తాజా వివరాలు!

India reports 12899 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 12,899 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 17,824 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,90,183 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 107 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,54,703 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,04,80,455  మంది కోలుకున్నారు. 1,55,025 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 44,49,552 మందికి వ్యాక్సిన్ వేశారు.
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 19,92,16,019 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,42,841 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News