గుంటూరు కలెక్టర్ గా వివేక్ యాదవ్ నియామకం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుంటూరు కలెక్టర్ గా వివేక్ యాదవ్ నియామకం

Vivek Yadav appointed as Gutur Collector
  • ప్రస్తుతం పోల్యూషన్ కంట్రోల్ బోర్టు సెక్రటరీగా పని చేస్తున్న వివేక్
  • తొలుత బసంత్ కుమార్ పేరును ప్రతిపాదించిన ఎస్ఈసీ
  • కాసేపట్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం
గుంటూరు జిల్లా కొత్త కలెక్టర్ గా వివేక్ యాదవ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెక్రటరీగా పని చేస్తున్నారు. అంతకు ముందు గుంటూరు జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమార్ పేరును ఎస్ఈసీ ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్యానల్ లో మరొకరైన వివేక్ యాదవ్ పై ఎస్ఈసీ మొగ్గు చూపింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా కలెక్టర్ గా వివేక్ యాదవ్ ను నియమించేందుకు జీఏడీలో కార్యాచరణ జరుగుతోంది. కాసేపట్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
Guntur District
Collector
Vivek Yadav

More Telugu News