Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • కొత్త దర్శకుడికి అనుష్క గ్రీన్ సిగ్నల్ 
  • 'ఆచార్య'కు ఓకే చెప్పిన సుదీప్
  • పవర్ స్టార్ సినిమాలో అనసూయ  
Anushka signs one more film in Telugu

*  ఇటీవల 'నిశ్శబ్దం' చిత్రంలో నటించిన ప్రముఖ నటి అనుష్క తాజాగా తెలుగులో మరో చిత్రానికి సంతకం చేసినట్టు తెలుస్తోంది. నూతన దర్శకుడు రమేశ్ చెప్పిన కథ నచ్చడంతో, ఆ ప్రాజక్టు చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. యూవీ క్రియేషన్స్ సంస్థ దీనిని నిర్మిస్తుంది.
*  చిరంజీవి, కొరటాల శివ కలయికలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. కాగా, ఇందులో ఓ గెస్ట్ పాత్రలో కన్నడ బిజీ స్టార్ సుదీప్ నటించనున్నట్టు తెలుస్తోంది. పాత్ర చిన్నదే అయినా ప్రాధాన్యతది కావడంతో సుదీప్ ని అడిగినట్టు, ఆయన ఓకే చెప్పినట్టు సమాచారం. 
*  పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న పిరీడ్ డ్రామా చిత్రంలో హాట్ యాంకర్ అనసూయ కీలక పాత్ర పోషించనుంది. వచ్చే నెలలో ఆమె ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతుందని తాజా సమాచారం.  

More Telugu News