సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Anupamas short film gets big response
  • అనుపమ చిత్రానికి భారీ రెస్పాన్స్ 
  • షూటింగుకి 'బంగార్రాజు' రెడీ
  • మే నుంచి వెంకటేశ్ కొత్త చిత్రం
  • బాలయ్య సినిమాలో నారా రోహిత్  
*  కథానాయిక అనుపమ పరమేశ్వరన్ తాజాగా 'ఫ్రీడమ్@మిడ్ నైట్' అనే షార్ట్ ఫిలింలో నటించింది. ఈ చిత్రాన్ని ఆన్ లైన్లో విడుదల చేయగా, భారీ రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన మూడు వారాల్లోనే దీనికి 11 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
*  అక్కినేని నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం షూటింగును ఈ నెల రెండవ వారం నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించనుంది.
*  ఇటీవలే 'నారప్ప' చిత్రాన్ని పూర్తిచేసి, ప్రస్తుతం 'ఎఫ్ 3' చిత్రంలో నటిస్తున్న ప్రముఖ నటుడు వెంకటేశ్ తన తదుపరి చిత్రాన్ని 'పెళ్లిచూపులు' ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ చిత్రం షూటింగును మే నెల నుంచి నిర్వహిస్తారని తెలుస్తోంది.  
*  బాలకృష్ణ, బోయపాటి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రంలో యంగ్ హీరో నారా రోహిత్ గెస్ట్ పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. ఇందులో ఆయన యంగ్ ఎమ్మెల్యే పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది.
Go Back to Shorts
Anupama Parameshvaran
Nagarjuna
Venkatesh Daggubati
Nara Rohith

More Telugu News