క్యూబాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఐదుగురి మృతి
- హెూల్విన్ ప్రావిన్స్ నుంచి గ్వాంటనామో ద్వీపానికి వెళ్తుండగా ప్రమాదం
- ఒక కొండపై కూలిన హెలికాప్టర్
- ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం
మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదని అన్నారు. హెూల్విన్ ప్రావిన్స్ నుంచి గ్వాంటనామో ద్వీపానికి బయల్దేరిన హెలికాప్టర్ మార్గమధ్యంలో సమస్య తలెత్తడంతో కూలిపోయిందని వివరించారు.
ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై కమిషన్‌ను ఏర్పాటు చేశారు. పలు వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, క్యూబాలో 2018లోనూ భారీ విమాన ప్రమాదం జరిగి 112 మంది మృతి చెందారు.