Cine Producer: పార్కింగ్‌లోని కారు మాయం.. బంజారాహిల్స్ పోలీసులకు నిర్మాత ఫిర్యాదు

  • ఈ నెల 26న నగరానికి వచ్చిన సినీ నిర్మాత
  • పార్క్ హయత్ హోటల్‌లో కారు పార్కింగ్
  • తర్వాతి రోజు ఉదయానికి మాయం
Producer car missing in park hyatt hotel in Banjara Hills

హోటల్ పార్కింగ్‌ స్థలంలో పార్క్ చేసిన తన కారు మాయమైందంటూ నిర్మాత ఒకరు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన ఓ సినీ నిర్మాత, వ్యాపారి వి.మంజునాథ్ నగరానికి వచ్చి బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌కు వెళ్లారు.  ఈ నెల 26న రాత్రి కారును డ్రైవర్ హోటల్ బేస్-2లో పార్క్ చేశాడు. ఆ తర్వాతి రోజు ఉదయం వచ్చి చూసేసరికి కనిపించలేదు. దీంతో మంజునాథ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

More Telugu News