Nidhi Agarwal: పవర్ స్టార్ చిత్రంలో నిధి అగర్వాల్?

  • 'ఇస్మార్ట్ శంకర్'తో నిధికి తొలి విజయం
  • క్రిష్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం
  • ఇటీవల షూటింగులో పాల్గొన్న నిధి  
  • మరో కథానాయికగా జాక్వెలిన్
Nidhi Agarwal opposite Pawan Kalyan

టాలీవుడ్ లో ఇటీవలి కాలంలో పలువురు కొత్త హీరోయిన్లు రంగప్రవేశం చేశారు. వాళ్లలో కొందరే మంచి అవకాశాలతో రాణిస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో నిధి అగర్వాల్ కూడా వుంది. 'సవ్యసాచి' సినిమాతో కథానాయికగా టాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ.. ఆమధ్య రామ్ నటించిన 'ఇస్మార్ట్ శంకర్'లో హీరోయిన్ గా నటించి తొలి విజయాన్ని అందుకుంది.

 తాజాగా ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే బిగ్ ఆఫర్ ను అందుకున్నట్టు వార్తలొస్తున్నాయి. క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఓ పిరీడ్ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే హైదరాబాదులో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగు కూడా మొదలైంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఓ కథానాయికగా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈమె ఈ చిత్రం షూటింగులో కూడా పాల్గొందని అంటున్నారు. ఈ సినిమాలో మరో కథానాయికగా బాలీవుడ్ తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తుందని సమాచారం.  

More Telugu News