అమ్మకానికి 533 మిలియన్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల నంబర్లు.. అందులో 60 లక్షల మంది భారతీయులు!
- ఫేస్‌బుక్ లోపాన్ని అడ్డం పెట్టుకుని సేకరించిన హ్యాకర్
- 2019లో లోపాన్ని సవరించిన ఫేస్‌బుక్
- ఒక నంబరుకు 5 డాలర్లు, డేటాకు 5 వేల డాలర్ల ధర నిర్ణయం
2019లో ఫేస్‌బుక్ ఆ లోపాన్ని సవరించినప్పటికీ అప్పటికే అతడు ఈ సమాచారం మొత్తాన్ని సేకరించి పెట్టుకున్నాడని అలొన్ తెలిపారు. సోషల్ మీడియా ఖాతాలు, వాటి ఫోన్ నంబర్లతో ఆ హ్యాకర్ ఓ డేటాబేస్‌ను తయారుచేసుకున్నాడని చెప్పారు. వాటినే ఇప్పుడు విక్రయానికి పెట్టాడని వివరించారు. ఒక్కో ఫోన్ నంబరును తెలుసుకోవడానికి 5 డాలర్లు, డేటా గురించి తెలుసుకోవాలంటే 5 వేల డాలర్ల ధరను హ్యాకర్ నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ వరకు వీటిని ఆ హ్యాకర్ విక్రయానికి పెట్టాడని అలొన్ గాల్ పేర్కొన్నారు.