భారత రిపబ్లిక్ డే వేడుకల్లో తొలిసారి కదం తొక్కనున్న బంగ్లాదేశ్ ఆర్మీ
- బంగ్లాదేశ్ స్వాత్రంత్యానికి 50 ఏళ్లు
- 1971లో యుద్ధం
- భారత్ సాయంతో పాక్ నుంచి స్వాతంత్ర్యం పొందిన బంగ్లాదేశ్
- ఎర్రకోటపై పరేడ్ చేయనున్న బంగ్లాదేశ్ సైనికులు
ఈ నేపథ్యంలో, 122 మంది సైనికులతో కూడిన బంగ్లాదేశ్ బృందం భారత సైన్యంతో కలిసి కవాతు చేయనుంది. బంగ్లాదేశ్ త్రివిధ దళాలకు చెందిన ఈ బృందానికి మొహత్సిమ్ హైదర్ చౌదరి నాయకత్వం వహిస్తున్నారు.
ఓ విదేశీ సైన్యానికి భారత రిపబ్లిక్ డే పరేడ్ లో స్థానం కల్పించడం ఇది మూడోసారి. 2016లో ఫ్రాన్స్ సైన్యం, 2017లో యూఏఈ సైనికులు ఎర్రకోటపై భారత త్రివిధ దళాలతో కలిసి మార్చ్ పాస్ట్ లో పాల్గొన్నారు.