అయోధ్య విరాళాల విషయంలో క్షమాపణలు చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
- విరాళాలు ఇవ్వొద్దంటూ నిన్న వ్యాఖ్యలు చేసిన విద్యాసాగర్ రావు
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు
- వెనక్కి తగ్గిన విద్యాసాగర్ రావు
- మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని విజ్ఞప్తి
- తాను కూడా రాముడి భక్తుడినే అని వివరణ
విరాళాల విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పానని వివరించారు. కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించి, దుష్ప్రచారం చేస్తున్నారని విద్యాసాగర్ రావు ఆరోపించారు. తాను కూడా రాముడి భక్తుడినే అని, తాను కూడా అయోధ్య వెళతానని నష్టనివారణ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మత రాజకీయాలు మానుకుంటే బాగుంటుందని, దీనిపై రాజకీయం చేయడం తగదు అని అన్నారు.