దేశంలో కొత్త‌గా 14,545 మందికి కరోనా నిర్ధారణ

India reports 14545 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,25,428  
  • మృతుల సంఖ్య 1,53,032
  • మొత్తం 10,43,534 మందికి వ్యాక్సిన్లు
దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 14,545 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 18,002 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,25,428  కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 163 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,53,032కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,02,83,708 మంది కోలుకున్నారు. 1,88,688 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 10,43,534 మందికి వ్యాక్సిన్లు వేశారు.
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 19,01,48,024 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 8,00,242 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India
vaccine

More Telugu News