ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు రేపు టీమిండియా ఎంపిక
- ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్
- రేపు సమావేశం కానున్న సెలెక్షన్ కమిటీ
- గాయపడిన ఆటగాళ్లపై నిర్ణయం తీసుకోనున్న సెలెక్టర్లు
- విశేషంగా రాణిస్తున్న కొత్త ఆటగాళ్లు
- సెలెక్టర్లకు కొత్త సమస్యలు!
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిశాక టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లాండ్ తో మ్యాచ్ లు ఆడనుంది. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు తొలి టెస్టు, ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు రెండో టెస్టు చెన్నై వేదికగా జరగనున్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టు ఈ నెల 27న చెన్నై రానుంది. ప్రస్తుతం లంకతో ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టులో లేని ఆటగాళ్లు కాస్త ముందుగానే జనవరి 23న భారత్ చేరుకోనున్నారు.