ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే కీల‌క నిర్ణయాలు తీసుకోనున్న బైడెన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే కీల‌క నిర్ణయాలు తీసుకోనున్న బైడెన్

biden will sign on few decisions on 20th jan
  • ఈ నెల‌ 20న జో బైడెన్‌ ప్రమాణస్వీకారం
  • కొన్ని కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు
  • 12 కీలక దస్త్రాలపై సంత‌కాలు  
  • పారిస్‌ ఒప్పందంలో మ‌ళ్లీ చేర‌నున్న అమెరికా  
  • ముస్లిం దేశాలకు రాకపోకలపై ఉన్న బ్యాన్ ఎత్తివేత‌
అమెరికా అధ్యక్షుడిగా ఈ నెల‌ 20న డెమొక్రాటిక్ పార్టీ నేత‌ జో బైడెన్‌ ప్రమాణస్వీకారం చేయనున్న విషయం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో అధ్య‌క్షుడిగా ప‌గ్గాలు చేప‌ట్టిన అనంత‌రం తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై  బైడెన్ ఇప్ప‌టికే కార్యాచరణ ప్రారంభించారు. ఆయ‌న‌ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కొన్ని కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేయ‌నున్నారు.

జ‌న‌వ‌రి 20న ఓవల్‌ ఆఫీస్‌లో బాధ్యతలు చేపట్టిన వెంటనే 12 కీలక దస్త్రాలపై ఆయ‌న సంత‌కాలు చేస్తార‌ని  వైట్‌ హౌస్ త‌దుప‌రి చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ రోన్‌ క్లెయిన్‌ తెలిపారు. ఈ మేర‌కు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఆయ‌న తీసుకోనున్న కీల‌క నిర్ణ‌యాల్లో పారిస్‌ ఒప్పందంలో మ‌ళ్లీ చేర‌డం కూడా ఉంద‌ని వివ‌రించారు.

అలాగే, క‌రోనా నిబంధ‌న‌ల‌ను మ‌రింత స‌మ‌ర్థంగా అమ‌లు చేయ‌డం, ముస్లిం దేశాలకు రాకపోకలపై ఉన్న బ్యాన్ ను ఎత్తివేయడం వంటి నిర్ణ‌యాల‌ను బైడెన్ తీసుకుంటార‌ని తెలిపారు.  అమెరికాకు అక్ర‌మంగా వ‌ల‌స వ‌చ్చి  ట్రంప్‌ నిబంధనల వల్ల పిల్లలకు దూరమైన వారి ప‌ట్ల బైడెన్ సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని చెప్పారు.

వారంతా తిరిగి కలుసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. బైడెన్ ప్ర‌మాణ స్వీకారం చేసిన రెండో రోజున క‌రోనా క‌ట్ట‌డిపై కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని చెప్పారు. అలాగే, అమెరికాలో విద్యా సంస్థలను తిరిగి తెర‌వ‌డం వంటి అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. ఇప్ప‌టికే బైడెన్ ప్ర‌క‌టించిన విధంగా అమెరికాలోని ప్ర‌జ‌లంతా 100 రోజుల పాటు త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ను ధ‌రించ‌డం వంటి చ‌ర్య‌లను బైడెన్ అమ‌లు చేయ‌నున్నారు.
Joe Biden
USA

More Telugu News