Krack Movie: ‘మాస్టర్’ కోసం ‘క్రాక్’ను లేపేస్తారా?: దిల్‌రాజుపై డిస్ట్రిబ్యూటర్ మండిపాటు

Warangal Distributor Srinu Fires on Producer Dil Raju
  • తెలుగు సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని గతంలో ఆయనే చెప్పారు
  • ఆయన పేరును కిల్‌రాజుగా మార్చాలి
  • మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమాను లేపేయడం దారుణం
టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు‌పై వరంగల్‌కు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీను ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను డిస్ట్రిబ్యూట్ చేసిన  ‘క్రాక్’ సినిమాకు సరైన థియేటర్లు ఇవ్వలేదని ఆరోపించారు. రవితేజ నటించిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిందని, అయినప్పటికీ దీనికి థియేటర్లు తగ్గించి, డబ్బింగ్ సినిమా అయిన విజయ్ నటించిన ‘మాస్టర్’కు ఎక్కువ థియేటర్లు కేటాయించారని అన్నారు. దిల్ రాజు పేరును ‘కిల్ రాజు’గా మార్చాలని మండిపడ్డారు.

సంక్రాంతి రోజున తెలుగు సినిమాలకు కాకుండా, తమిళ సినిమాలకు ప్రాధాన్యం ఎలా ఇస్తారని ప్రశ్నించిన ఆయనే ఇప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. క్రాక్ సినిమాకు టాక్ బాగుందని, అందుకే ఇలా మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమాను థియేటర్ల నుంచి తీసేయడం తనను ఆవేదనకు గురిచేసిందని  డిస్ట్రిబ్యూటర్ శ్రీను అన్నారు.
Krack Movie
Master Movie
Raviteja
Dil Raju
Tollywood

More Telugu News