Rajasthan: రాజస్థాన్‌లో అధికారంలోకి వస్తాం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా

Will come into power in Rajasthan said Satish Punia
  • 2023 శాసనసభ ఎన్నికల్లో విజయం సాధిస్తాం
  • ఏళ్ల తరబడి కాంగ్రెస్ అధికారంలో ఉన్నా రైతులకు ఒరిగిందేమీ లేదు
  • బీజేపీని తిరుగులేని శక్తిగా నిలబెడతా
రాజస్థాన్‌లో అధికారంలోకి వస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా ధీమా వ్యక్తం చేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని పేర్కొన్నారు. బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం ఒక్కటే తన లక్ష్యం కాదని, తిరుగులేని శక్తిగా నిలబెడతానని కూడా స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు దారుణంగా ఉందని, ఆ పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వ పనితీరు నచ్చడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏళ్ల తరబడి అధికారంలో ఉన్నా రైతులు, సైనికులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఇప్పుడు కూడా రైతులను తప్పుదోవపట్టించడాన్నే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని అన్నారు. అయితే, కాంగ్రెస్ కుట్రలు ఫలించబోవని సతీశ్ పూనియా తేల్చి చెప్పారు.
Rajasthan
BJP
Satish Punia
Congress

More Telugu News