ప్రజా ప్రతినిధులకు టీకా లేదన్న ప్రధాని... ఇవ్వాలని అంటున్న పుదుచ్చేరి సీఎం!
- మరో 3 రోజుల్లో ఇండియాలో వ్యాక్సినేషన్
- తొలి దశలో వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి
- ప్రజా ప్రతినిధులకు ఇవ్వాలని కోరిన నారాయణ స్వామి
సీఎంలు, మంత్రులు, శాసన సభ్యులకు టీకాను కేటాయించాలని, వారందరికీ టీకా ఇస్తేనే, దాన్ని తాము కూడా వేసుకోవచ్చన్న నమ్మకాన్ని ప్రజల్లో పెంచవచ్చని నారాయణ స్వామి అభిప్రాయపడ్డారు. కాగా, మరో 3 రోజుల్లో టీకా పంపిణీ ఇండియాలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఇప్పటికే వ్యాక్సిన్ వయల్స్ పలు రాష్ట్రాలకు చేరుకున్న సంగతి తెలిసిందే. తొలి దశలో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య శాఖ ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయం.