కేసీఆర్‌ మళ్లీ ఫాంహౌస్‌కే పరిమితమవుతారేమోనని ఆందోళన కలుగుతోంది: విజ‌య‌శాంతి

11-01-2021 Mon 10:29
  • కేసీఆర్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యుల ప్రకటన
  • ఆయన నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండాలి
  • అయితే, కేసీఆర్ గారు ప్రగతిభవన్ నుంచి మాయం కాకూడదు 
  • ప్రజా సమస్యలకు స‌మ‌యం కేటాయించాలి
vijaya shanti slams kcr

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న ఆరోగ్యం బాగుంద‌ని, వైద్యులు తెలిపార‌ని, అయితే, మ‌ళ్లీ ఫాంహౌస్ కు ప‌రిమితం కాకూడదని ఆమె చెప్పారు.

'ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారన్న వైద్యుల ప్రకటన సంతోషాన్నిచ్చింది. ఆయన నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ తన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందన్న ప్రకటన ఇచ్చిన భరోసాతో కేసీఆర్ గారు ప్రగతిభవన్‌లో మాయమై మళ్లీ ఫాంహౌస్‌కే పరిమితమవుతారేమోనని అందోళన కలుగుతోంది' అని అన్నారు.

'ఆయన తన తీరు మార్చుకుని హైదరాబాదులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు... దయకలిగితే కొంత సమయం ప్రజలకు, ప్రజా సమస్యలకు కేటాయించే కార్యక్రమం చేపడతారని తెలంగాణ సమాజం, అధికార పార్టీ నేతలు కూడా ఎదురు చూస్తున్నారు' అని అన్నారు.

'అయితే, అవినీతి కేసులు తేలితే... ఏదో ఒక రోజు చెయ్యి జారిపోయే పరిస్థితులున్న ఆ ముఖ్యమంత్రి పదవిలో ఆ మిగిలిన కాలమైనా కొంచెం పని చేస్తే మంచిది' అని అన్నారు.