ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ హీరో?

07-01-2021 Thu 17:09
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ 'సలార్'
  • కథానాయికగా బాలీవుడ్ భామ దిశా పఠానీ
  • విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం?   
  • 'కేజీఎఫ్ 2' పూర్తవగానే 'సలార్' షూటింగ్   
Bollywood star John Abraham to be villain for Prabhas

పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ నటించే సినిమాలలో క్యాస్టింగ్ పరంగా చాలా వెయిట్ కనపడుతోంది. ఇప్పటికే వైజయంతీ మూవీస్ నిర్మించే సినిమాలో దీపికా పదుకొణే హీరోయిన్ గా నటిస్తుంటే, అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోపక్క 'ఆదిపురుష్' సినిమాలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. తాజాగా ప్రభాస్ నటించే మరో సినిమాకు సంబంధించి మరో వార్త కూడా వినిపిస్తోంది.

'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'సలార్' పేరిట ఓ పాన్ ఇండియా సినిమా రూపొందనున్న సంగతి విదితమే. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ ఆమధ్య రాగా, వీటికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇందులో దిశా పఠానీ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ క్రమంలో ఇందులో విలన్ పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం పోషించనున్నట్టు తాజాగా తెలుస్తోంది. ప్రస్తుతం జాన్ అబ్రహాంతో సంప్రదింపులు జరుగుతున్నాయనీ, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందనీ సమాచారం. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ చేస్తున్న 'కేజీఎఫ్ 2' పూర్తవగానే, 'సలార్' షూటింగ్ మొదలవుతుంది.