Hyderabad: మబ్బేసిన హైదరాబాద్... పలు చోట్ల చిరు జల్లులు!

  • ఉపరితల ద్రోణి ప్రభావంతో మబ్బులు
  • స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రతలు
  • మరో రెండు రోజుల పాటు ప్రభావం
Rain in Telangana

ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మబ్బులు కమ్ముకున్నాయి. హైదరాబాద్ సహా, చుట్టుపక్కల రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ - మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ తదితర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. మబ్బుల కారణంగా ఉష్ణోగ్రతలు సైతం పెరుగగా, గాలిలో తేమశాతం కూడా పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావం మరో రెండు రోజుల పాటు కొనసాగవచ్చని, రాత్రి పూట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని తెలిపారు.

More Telugu News