దుబాయ్ ప్రధాని కోసం అతిపెద్ద గ్రీటింగ్ కార్డు... గిన్నిస్ రికార్డు కొట్టేసిన ఇండియన్!

Gunnis Record for Dubai Indian
  • దుబాయ్ లో ఉంటున్న రామ్ కుమార్
  • ప్రధానిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్ మఖ్తుమ్
  • 8.2 చదరపు మీటర్ల పాప్ అప్ గ్రీటింగ్ కార్డు
దుబాయ్ లో ఉంటున్న రామ్ కుమార్ సారంగపాణి అనే ఇండియన్, ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తుమ్ కోసం అతిపెద్ద పాప్ అప్ గ్రీటింగ్ కార్డును తయారు చేసి, గిన్నిస్ రికార్డును సాధించాడు. అల్ మఖ్తుమ్ పదవీ బాధ్యతలు స్వీకరించి, 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ కార్డును తయారు చేశారు. నాలుగు మీటర్ల పొడవు, 2.05 మీటర్ల వెడల్పుతో దీన్ని ఆరు నెలల పాటు శ్రమించి తయారు చేశానని 'గల్ఫ్ న్యూస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ కుమార్ వెల్లడించారు. 8.2 చదరపు మీటర్ల పరిమాణంతో తయారు చేసిన ఈ కార్డుకు గిన్నిస్ రికార్డు లభించడం తనకెంతో గర్వకారణమని అన్నారు.
Go Back to Shorts
Dubai
Prime Minister
Gunnis
Record

More Telugu News