గంగూలీతో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోదీ

PM Modi talks to Sourav Ganguly
  • ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగూలీ
  • దాదా ఆరోగ్య వివరాలు తెలుసుకున్న ప్రధాని
  • గంగూలీ అర్ధాంగితోనూ ఫోన్ లో మాట్లాడిన వైనం
  • నిలకడగా గంగూలీ ఆరోగ్యం
గుండెపోటుకు గురై కోల్ కతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. గంగూలీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటూ వాకబు చేశారు. అంతకుముందు ప్రధాని గంగూలీ అర్ధాంగి డోనాతోనూ మాట్లాడారు. శనివారం నాడు గంగూలీ అస్వస్థతకు గురైనట్టు వార్తలు రాగా, ప్రధాని వెంటనే గంగూలీ పరిస్థితిపై ఆరా తీశారు.

ఛాతీలో కొద్దిపాటి నొప్పితో గంగూలీ శనివారం ఆసుపత్రిపాలైన సంగతి తెలిసిందే. వ్యాయామం చేస్తుండగా ఛాతీలో నొప్పి, తల భారంగా ఉండడం, వాంతులు, మగతగా ఉండడం వంటి లక్షణాలతో బాధపడ్డారు. ట్రెడ్ మిల్ పై కసరత్తులు చేస్తుండగా ఆయన తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దాంతో వెంటనే కోల్ కతాలోని వుడ్ లాండ్స్ ఆసుపత్రిలో చేరారు. గంగూలీకి అక్కడి వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.
Go Back to Shorts
Narendra Modi
Sourav Ganguly
Phone
Heart Attack

More Telugu News