Train Accident: వెంట్రుక వాసిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వ్య‌క్తి.. వీడియో ఇదిగో

  • రైలు ప‌ట్టాలు దాటుతుండ‌గా ఊడిపోయిన బూటు
  • అక్క‌డే బూటును వేసుకున్న వైనం
  • రైలు వ‌స్తున్న‌ప్ప‌టికీ అజాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌యాణికుడు
  • చివ‌రి క్ష‌ణంలో బ‌య‌ట‌కు లాగిన పోలీసు
 Mumbai Cop Saves Elderly Man from being Crushed Under Train

వెంట్రుక వాసిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు ఓ వ్య‌క్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ముంబైలోని దహిసార్ రైల్వే స్టేషన్‌లో రైలు పట్టాలను దాట‌డానికి  గన్‌పత్ సోలంకీ (60) అనే ఓ వ్యక్తి  ప్ర‌య‌త్నించాడు. ఆ స‌మయంలో అత‌డి బూటు జారి ప‌డిపోయింది.

దీంతో రైలు వ‌స్తోంద‌ని తెలిసిన‌ప్ప‌టికీ రైలు ప‌ట్టాల ప‌క్క‌నే బూటును తిరిగి వేసుకుని తెలివి త‌క్కువ‌గా వ్య‌వ‌హ‌రించాడు. రైలు దూసుకు వ‌స్తున్న‌ప్ప‌టికీ తిరిగి రైలు ప‌ట్టాల‌ను దాట‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఓ పోలీసు ఈ విష‌యాన్ని గుర్తించి అత‌డిని ప్లాట్ ఫాం మీద‌కు లాగాడు. దీంతో సోలంకీ త్రుటిలో ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నాడు. అనంత‌రం సోలంకీని ఆ పోలీసు చెంప‌పై కొట్టి బుద్ధి చెప్పాడు.

More Telugu News