టీఎంసీ నేతను తుపాకితో కాల్చి చంపిన దుండగులు
- మిత్రుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఘటన
- పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు
- హౌరాలో ఉద్రిక్త పరిస్థితులు
తీవ్రంగా గాయపడిన ధర్మేంద్రను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ధర్మేంద్ర మిత్రుడు కూడా స్వల్పంగా గాయపడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ హత్య వెనక వ్యక్తిగత కక్షలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ధర్మేంద్ర గతంలో నిర్మాణ రంగంలో ఉండేవారు. అప్పట్లో జరిగిన గొడవలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. కాగా, ధర్మేంద్ర హత్యతో హౌరాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. పలు వాహనాలను తగలబెట్టారు. దుకాణాలను ధ్వంసం చేశారు.