టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య ఘటనపై భార్య అపరాజిత ఆరోపణలు

MLA Prasad Reddy behind my husband murder accused subbaiah wife
షార్ట్స్‌లో చూడండి
తన భర్త హత్య వెనక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది ఉన్నారని టీడీపీ నేత నందం సుబ్బయ్య భార్య అపరాజిత ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని, ఈ విషయంపై ఎక్కడికైనా సరే వచ్చి మాట్లాడేందుకు సిద్ధంగా వున్నానని చెప్పారు. మరోవైపు, ఈ కేసులో లొంగిపోయిన నలుగురు నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సుబ్బయ్యను సోమలవారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఇళ్ల స్థలాల ప్లాట్ల వద్ద దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపారు. కళ్లలో కారం చల్లిన దుండగులు, ఆపై మారణాయుధాలతో దాడి చేయడంతో సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ హత్యపై రాజకీయ దుమారం రేగుతోంది. రాజకీయ కోణంలోనే హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సుబ్బయ్య హత్యను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు.
Go Back to Shorts
Kadapa District
Proddutur
TDP
Murder
Nandam Subbiah

More Telugu News