నాకు ముఖ్యమంత్రి పదవి కూడా అవసరం లేదు: నితీశ్ కుమార్
- బీజేపీ సీఎం పదవిని ఆశిస్తుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు
- నేను ముఖ్యమంత్రి కుర్చీకి అంకితం కాలేదు
- సీఎం పదవి వద్దని ఇంతకు ముందే మిత్రపక్షాలకు చెప్పాను
తాను ముఖ్యమంత్రి కుర్చీకి అంకితం కాలేదని ఆయన చెప్పారు. నిజానికి తాను అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించలేనని ఎన్డీఏలోని పార్టీలకు తెలిపానని అన్నారు. అయితే, ఇందుకు వారు ఒప్పుకోలేదని ఆయన చెప్పారు. తనపై చాలా ఒత్తిడి తర్వాత తాను మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చిందని అన్నారు. ఈ పదవి పట్ల తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని, సీఎం పదవి అవసరం లేదని చెప్పారు.