Nara Lokesh: జగన్ పాలనలో మరో గిరిజన యువతి బలైపోయింది: నారా లోకేశ్

Lokesh slams CM jagan in another incident
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై మరోసారి ధ్వజమెత్తారు. జగన్ పాలనలో మరో గిరిజన యువతి బలైపోయిందని ఆరోపించారు. బంగారు భవిష్యత్తు ఉన్న పూజారి ప్రియాంక అనే అమ్మాయి రాయచోటిలో వైసీపీ నేతల ఒత్తిడి, కొందరు పోలీసు అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా చావుబతుకు మధ్య కొట్టుమిట్టాడుతోందని తెలిపారు.

ప్రియాంక ప్రేమ పేరుతో మోసపోయిందని, ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తండ్రికి అవమానం ఎదురవడంతో ఆ అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నించిందని లోకేశ్ వెల్లడించారు. ప్రియాంకను మోసం చేసిన వ్యక్తి తండ్రి వైసీపీ ఎమ్మెల్యేకి అనుచరుడని, అందుకే ప్రియాంకకు ఈ పరిస్థితి వచ్చిందని వివరించారు.

ప్రభుత్వం ప్రియాంకకు మెరుగైన వైద్యం అందించాలని, ఆమెకు ఇలాంటి దుస్థితి కలగడానికి కారణమైన వైసీపీ నాయకులపైనా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Jagan
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News