ఆదిలాబాద్ జిల్లాలో జమీర్ ఇంటి వద్ద ఉద్రిక్తత
- ఈ నెల 18న జమీర్ పై కాల్పులు జరిపిన ఫారుఖ్
- ఈ ఉదయం నిమ్స్ ఆసుపత్రిలో మృతి
- ఫారుఖ్ ను పార్టీ నుంచి తొలగించిన ఎంఐఎం
మరోవైపు అంత్యక్రియల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే కాల్పులు జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత ఫారుఖ్ ను ఎంఐఎం పార్టీ బహిష్కరించింది. అంతేకాదు ఆదిలాబాద్ జిల్లా శాఖను ఆ పార్టీ రద్దు చేసింది.