ఆదిలాబాద్ కాల్పుల ఘటనలో గాయపడిన జమీర్ మృతి
Add ap7am to your home Screen

ఆదిలాబాద్ కాల్పుల ఘటనలో గాయపడిన జమీర్ మృతి

Syed zameer who undergo treatment dead
  • నిందితుడు ఎంఐఎం నేత 
  • నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితుడు
  • పాతకక్షలతో తుపాకి, కత్తితో చెలరేగిపోయిన షారూఖ్ అహ్మద్
ఆదిలాబాద్‌లో ఎంఐఎం నేత షారూఖ్ అహ్మద్ (48) జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న సయ్యద్ జమీర్ (52) నేడు మృతి చెందాడు. వారం రోజుల క్రితం ఇక్కడి తాటిగూడలో పాత కక్షలు పురివిప్పాయి. ఇవి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీశాయి.

ఈ నేపథ్యంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడైన షారూఖ్ అహ్మద్ కత్తి, తుపాకితో చెలరేగిపోయాడు. ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇద్దరిపై కాల్పులు జరిపాడు. మరొకరిపై కత్తితో దాడిచేశాడు. షారూఖ్ కాల్పుల్లో జమీర్, మోతేషాన్ గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన జమీర్‌ను హైదరాబాద్ నిమ్స్‌‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమించడంతో నేడు కన్నుమూశాడు.
Adilabad District
MIM
Telangana
Crime News

More Telugu News