Jagananna Vidya Deevena: జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల్లో మార్పులు చేసిన ప్రభుత్వం

AP govt changes condition for Jagananna Vidya Deevena and Vasathi Deevena
  • కన్వీనర్ కోటాలో అడ్మిషన్లు పొందిన పీజీ విద్యార్థులకు మాత్రమే వర్తింపు   
  • ప్రైవేట్, అన్ ఎయిడెడ్ కాలేజీలకు వర్తించవు
  • ఈ విద్యా సంవత్సరం నుంచే వర్తింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలలో మార్పులు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలలో చదివే పీజీ విద్యార్థులకు ఈ పథకాలు వర్తించవు. ఈ రెండు పథకాలను కేవలం యూనివర్శిటీలు, ప్రభుత్వ పీజీ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ ఆదేశాలను జారీ చేసింది.

కన్వీనర్ కోటాలో అడ్మిషన్లు పొందిన ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తాడిత పీజీ విద్యార్థులకు మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. 2020-21 విద్యా సంవత్సరానికి నమోదైన అడ్మిషన్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని వెల్లడించింది.
Jagananna Vidya Deevena
Jagananna Vasathi Deevena
YSRCP

More Telugu News