Raviteja: 'కోరమీసం పోలీసోడా..' అంటున్న శ్రుతిహాసన్!

Third song out from Ravitejas Crack movie
  • గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ 'క్రాక్'
  • ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసిన యూనిట్
  • ఈ రోజు మూడో పాట 'కోరమీసం పోలీసోడా' విడుదల
  • సంక్రాంతి సందర్భంగా జనవరి 14న సినిమా రిలీజ్     
మాస్ మహారాజ్ గా పేరుతెచ్చుకున్న హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'క్రాక్'. ఇందులో తను పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. అందుకేనేమో, కథానాయిక శ్రుతి హాసన్ "కోరమీసం పోలీసోడా.. నన్ను కొంచెం చూసూకోరా' అంటూ పాట అందుకుంది.

ఈ పాటను క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసిన యూనిట్, ఇప్పుడీ 'పోలీసోడా' పాటను మూడో పాటగా రిలీజ్ చేసింది. తమన్ సంగీత సారథ్యంలో రమ్య బెహరా ఈ పాటను శ్రావ్యంగా ఆలపించింది. చిత్రంలో ఈ పాటను రవితేజ, శ్రుతిహాసన్ పై చిత్రీకరించారు. 

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. రవితేజ, శ్రుతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషించింది. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయనున్నారు.
Raviteja
Shruti Hassan
Gopichand Malineni

More Telugu News