Nara Lokesh: ఇంకెంత కాలం నీ దరిద్రపు కుల రాజకీయం?: జగన్ పై నారా లోకేశ్ ఫైర్

How long you do caste politics as Nara Lokesh to Jagan
  • జనాభా అసమతుల్యానికి, కుల అసమతుల్యానికి కూడా తేడా తెలియని వ్యక్తి
  • కుల విద్వేషం రెచ్చగొట్టేందుకు యత్నించారు
  • నువ్వు ఒకే సామాజిక వర్గానికి ముఖ్యమైన 850 పోస్టులు కట్టబెట్టావ్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనాభా అసమతుల్యానికి, కుల అసమతుల్యానికి కూడా తేడా తెలియని వ్యక్తి  అంటూ ఎద్దేవా చేశారు. 'జనాభా అసమతుల్యానికి, కుల అసమతుల్యానికి తేడా తెలియని వాడు సీఎం అయితే ఇలానే ఉంటుంది. డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే కుల అసమతుల్యం కాదని తెలిసి కూడా కుల విద్వేషం రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. అందుకే నిన్ను ఫేక్ సీఎం అనేది'  అని ట్విట్టర్ ద్వారా దుయ్యబట్టారు.  

నువ్వు ఒకే సామాజిక వర్గానికి ముఖ్యమైన 850 పోస్టులు కట్టబెట్టి బడుగు, బలహీన వర్గాలకు ముష్టి పడేసావ్ చూశావా... అది కుల అసమతుల్యం అంటే అంటూ లోకేశ్ విమర్శించారు. ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం ఇచ్చావా? ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసావా? అని ప్రశ్నించారు. ఇంకెంత కాలం నీ దరిద్రపు కుల రాజకీయం? అని మండిపడ్డారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News