Tuck Jagadish: రేపు నాని అభిమానులకు 'టక్ జగదీశ్' నుంచి క్రిస్మస్ కానుక

  • నాని హీరోగా టక్ జగదీశ్
  • శివ నిర్వాణ దర్శకత్వంలో నాని 26వ సినిమా
  • డిసెంబరు 25న ఫస్ట్ లుక్ రిలీజ్ కు సన్నాహాలు
  • సోషల్ మీడియాలో వెల్లడించిన చిత్రబృందం
First Look from Tuck Jagadish will be launched on Christmas

నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'టక్ జగదీశ్'. నాని మార్కు వినోదంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 'టక్ జగదీశ్' యూనిట్ నాని అభిమానుల కోసం క్రిస్మస్ గిఫ్టుకు రంగం సిద్ధం చేసింది. రేపు (డిసెంబరు 25) ఉదయం 10.08 గంటలకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించింది.

కరోనా లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘ విరామానంతరం 'టక్ జగదీశ్' షూటింగ్ ఇటీవలే పునఃప్రారంభమైంది. 'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రావు రమేశ్, నాజర్, నరేశ్ వంటి సీనియర్లు నటిస్తున్నారు. ఈ సినిమా నాని కెరీర్ లో 26వది. 'టక్ జగదీశ్' చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు.

More Telugu News