Saitej: 'కరోనా వంకతో పెళ్లి వాయిదా వేశా'నంటున్న సాయితేజ్

Sai Tej says he postponed his marriage
షార్ట్స్‌లో చూడండి
మన టాలీవుడ్ బ్రహ్మచారుల్లో హీరో సాయితేజ్ కూడా వున్నాడు. ఇటీవలి కాలంలో ఒక్కొక్కరే పెళ్లి చేసుకుంటూ వుండడంతో సాయితేజ్ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతాడంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఈ హీరో నుంచి మాత్రం పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. దీనిపైనే సాయితేజ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ, తన పెళ్లిని మరో ఏడాదిన్నర పాటు వాయిదా వేశానని చెప్పాడు.

"పెళ్లిని ఎప్పటికప్పుడు వాయిదా వేసుకోవడానికి అబ్బాయిలు ప్రయత్నిస్తుంటారు. అయితే, ఎప్పుడు పెళ్లి చేసేద్దామా అని తల్లిదండ్రులు ఆలోచిస్తూవుంటారు. అందుకే, పెళ్లిని ఏదో కొంతకాలం పాటు పోస్ట్ పోన్ చేయడం మినహా అబ్బాయిలు దాని నుంచి తప్పించుకోలేరు. నా పరిస్థితీ అలాగే వుంది. కరోనా వంకతో ఏడాదిన్నర పాటు పెళ్లిని పోస్ట్ పోన్ చేయగలిగా" అని చెప్పాడు సాయితేజ్ నవ్వుతూ.

కాగా, సాయితేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో రూపొందిన 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం రేపు క్రిస్మస్ రోజున థియేటర్లలో విడుదలవుతోంది. ఇది పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి థియేటర్లో చూసి ఎంజాయ్ చేయదగ్గా సినిమా అనీ సాయితేజ్ చెప్పాడు. ఇందులో నభానటేష్ కథానాయికగా నటించింది.  
Go Back to Shorts
Saitej
Subbu

More Telugu News