క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్

Newly appointed CS Adithyanath Das met CM Jagan
ఏపీ పరిపాలనా యంత్రాంగంలో ఉన్నతస్థాయిలో మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ నియమితులు కాగా, ఈ నెల 31న పదవీవిరమణ చేయనున్న ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని సీఎం ముఖ్య సలహాదారుగా కొత్త బాధ్యతలందుకోనున్నారు.

 ఈ నేపథ్యంలో, నూతన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా అక్కడే ఉన్నారు. కాగా, ఈ నెల 31తో ప్రస్తుత సీఎస్ నీలం సాహ్నీ పదవీకాలం ముగియనుండగా, అదేరోజున ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు స్వీకరిస్తారు.
Go Back to Shorts
Adithyanath Das
Jagan
CS
Camp Office
Neelam Sahney
Andhra Pradesh

More Telugu News