ఫేక్ నోటీసులతో వినియోగదారులను బెదిరిస్తున్నారు: యాప్ లోన్ల అంశంపై సీపీ సజ్జనార్ వ్యాఖ్యలు
- మనీ లోన్ యాప్ లపై కొరడా ఝుళిపించిన పోలీసులు
- పలువురి అరెస్ట్
- 35 శాతం అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారన్న సజ్జనార్
- ఈ అంశాన్ని ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లామని వెల్లడి
- గూగుల్ కు నోటీసులు ఇచ్చామని వివరణ
ఆన్ లైన్ లో యాప్ ల ద్వారా రుణాలు తీసుకున్నవారి సంఖ్య దేశవ్యాప్తంగా 1.5 లక్షల వరకు ఉండగా, వారిలో 70 వేల మంది బాధితులేనని సజ్జనార్ అన్నారు. ఈ యాప్ ల నిర్వాహకులు 35 శాతం అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ దృష్టికి కూడా తీసుకెళ్లామని, నకిలీ లీగల్ నోటీసులతో వినియోగదారులను బెదిరిస్తున్నారని వివరించారు. ఇలాంటి యాప్ లకు ఎలా అనుమతి ఇచ్చారన్న విషయమై గూగుల్ కు నోటీసులు పంపామని సజ్జనార్ తెలిపారు.