క్రమంగా పెరుగుతున్న తిరుమల భక్తులు... రూ. 3 కోట్లు దాటిన హుండీ ఆదాయం!
- గతంతో పోలిస్తే ఇంకా సాధారణ స్థాయిలోనే రద్దీ
- ఆదివారం నాడు 40 వేల మందికి పైగా దర్శనం
- రూ. 3.13 కోట్లకు హుండీ ఆదాయం
ఇదే సమయంలో హుండీ ద్వారా వస్తున్న ఆదాయం కూడా రూ. 3 కోట్లను దాటింది. నిన్న హుండీ ద్వారా రూ. 3.13 కోట్ల ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. 14,635 మంది భక్తులు తలనీలాలు సమర్పించారన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాల కోసం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని, తిరుమల మొత్తాన్ని విద్యుద్దీపకాంతులతో అలంకరిస్తున్నామని అధికారులు తెలిపారు.