Monkey Rehabilitation Facility: రూ.2.25 కోట్లతో కోతులకు పునరావాస కేంద్రం... ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

  • తెలంగాణ సర్కారు జీవప్రేమ
  • కోతుల సంరక్షణకు కోట్ల వ్యయం
  • నిర్మల్ గండిరామన్న హరితవనంలో సంరక్షణ కేంద్రం
  • ఇక్కడే బోటింగ్, మూషిక జింకల పార్కు ఏర్పాటు
Minister Indrakaran Reddy inaugurates Monkey rehabilitation facility in Nirmal

తెలంగాణ ప్రభుత్వం కోతుల పట్ల ఉదారంగా వ్యవహరించింది. నిర్మల్ పట్టణంలో కోతుల కోసం ఏకంగా ఓ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. నిర్మల్ పట్టణంలోని గండి రామన్న హరితవనంలో రూ.2.25 కోట్ల వ్యయంతో ఈ సంరక్షణ-పునరావాస కేంద్రాన్ని నిర్మించారు.

ఈ నేపథ్యంలో, రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోతుల పునరావాస కేంద్రాన్ని ప్రారంభించారు. కాగా ఈ కేంద్రంలో మూషిక జింకల పార్కును కూడా ఏర్పాటు చేశారు. పిల్లల వినోదం కోసం బోటింగ్, సఫారీ, ఎకో హట్స్ వంటి సదుపాయాలున్నాయి.

More Telugu News