AP RTC: సంక్రాంతి సందర్భంగా 3,607 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీ ఆర్టీసీ నిర్ణయం

  • మరికొన్ని రోజుల్లో సంక్రాంతి పండుగ
  • స్పెషల్ బస్సులు సిద్ధం చేస్తున్న ఏపీ ఆర్టీసీ
  • జనవరి 8 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు
  • తెలంగాణ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచీ బస్సులు
AP RTC to run special buses in upcoming Sankranthi season

మరికొన్ని వారాల్లో సంక్రాంతి పండుగ వస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ఆర్టీసీ 3,607 ప్రత్యేక బస్సులు తిప్పాలని నిర్ణయించింది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు.  జనవరి 8 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపారు.

హైదరాబాదుతో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి 1,251 బస్సులు ఏర్పాటు చేశామని, బెంగళూరు నుంచి 433, చెన్నై నుంచి 133 బస్సులు తిప్పుతామని పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఏపీలోని ఇతర జిల్లాల నుంచి విజయవాడకు 201 బస్సులు, విశాఖపట్నంకు 551 బస్సులు తిరుగుతాయని వివరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య 1,038 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని బ్రహ్మానందరెడ్డి చెప్పారు.

More Telugu News