జల, వాయు, భూమిపైనే కాదు సైబర్ రూపంలోనూ యుద్ధం పొంచి ఉంది: హైదరాబాద్‌లో రాజ్‌నాథ్
- ఎదుర్కొనేందుకు మరింత సన్నద్ధం కావాలి
- వాయు సేన అందిస్తున్న సేవలు అభినందనీయం
- దుండిగల్ అకాడమీ ఎంతోమంది వీరులను దేశానికి అందించింది
- దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు వాయుసేన సిద్ధంగా ఉండాలి
ఇందులో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ... దేశానికి వాయు సేన అందిస్తున్న సేవలు అభినందనీయమని చెప్పారు. దుండిగల్ అకాడమీ ఎంతోమంది వీరులను దేశానికి అందించిందని చెప్పారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు వాయుసేన సిద్ధంగా ఉండాలని చెప్పారు.
స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ రంగంలో ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నామని తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ వాయుసేన అమ్ముల పొదిలో చేరడంతో వాయుసేనలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని తెలిపారు. భారత్ శాంతినే కోరుకుంటోందని, అయితే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఉగ్రవాదుల ఏరివేతకు కూడా రక్షణ దళాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. బాలకోట్ లో ఉగ్రవాదుల దాడి ఘటన అందరికీ తెలిసిందేనని చెప్పారు.