Ravichandran Ashwin: అడిలైడ్ లో అశ్విన్ మాయాజాలం... ఆసీస్ విలవిల

  • అడిలైడ్ లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా
  • 244 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించిన భారత్
  • బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్
  • 3 వికెట్లు తీసిన అశ్విన్
  • 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కంగారూలు
Ashwin rattles Aussies batting lineup

అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ డే/నైట్ టెస్టులో భారత బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా, ఇక్కడి పిచ్ పై టర్న్ లభించడంతో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మాయాజాలం ప్రదర్శించాడు. అశ్విన్ 3 కీలకమైన వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (1), ట్రావిస్ హెడ్ (7), కొత్త కుర్రాడు కామెరాన్ గ్రీన్ (11)లను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 46 ఓవర్లలో 5 వికెట్లకు 84 పరుగులు కాగా, మార్నస్ లబుషేన్ (43), కెప్టెన్ టిమ్ పైన్ (4) క్రీజులో ఉన్నారు.

అంతకుముందు, ఓపెనర్ మాథ్యూవేడ్ 8, మరో ఓపెనర్ జో బర్న్స్ 8 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయారు. లబుషేన్ ఇచ్చిన రెండు క్యాచ్ లను భారత ఫీల్డర్లు జారవిడిచారు. కాగా, ఇవాళ రెండో రోజు ఆట ఆరంభంలో భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 244 పరుగుల వద్ద ముగించింది. ఆపై ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్ షురూ చేసింది.

More Telugu News