KCR: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఆధార్ అడగొద్దన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై రేపు కేసీఆర్ సమీక్ష

kcr to conduct meeting tomorrow
షార్ట్స్‌లో చూడండి
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్ తప్పనిసరి చేయొద్దంటూ నిన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఉన్నస్థాయి సమీక్ష నిర్వహించి ఓ నిర్ణయాన్ని తీసుకోనున్నారని సీఎంవో తెలిపింది.

‘వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి హైకోర్టు ఆదేశాల కాపీ ఇంకా ప్రభుత్వానికి అందలేదు. అందిన తర్వాత దానిపై చర్చించి తగు నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు’ అని సీఎంతో పేర్కొంది.
 
‘హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లడమా? లేదంటే తగు విధమైన విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా? అనే అంశంపై రెవెన్యూ, న్యాయ శాఖల నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు’ అని సీఎంతో తెలిపింది.
Go Back to Shorts
KCR
TRS
High Court

More Telugu News