Jeevan Reddy: యుద్ధం చేస్తానని చెప్పి.. ఢిల్లీలో ఒంగి ఒంగి నమస్కారాలు పెడుతున్నారు: కేసీఆర్ పై జీవన్ రెడ్డి ఫైర్

KCR bowing in front of BJP leaders in Delhi says Jeevan Reddy
  • బీజేపీపై యుద్ధం చేయడమంటే ఇదేనా?
  • రైతు కష్టాలను పట్టించుకోవడం లేదు
  • ఇంత వరకు రైతు రుణమాఫీ చేయలేదు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారని... ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలకు ఒంగిఒంగి నమస్కారాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీపై యుద్ధం చేయడమంటే ఇదేనా? అని ప్రశ్నించారు.

తీవ్ర వర్షాలతో రైతులు భారీగా నష్టపోయారని... ఇంతవరకు పంట నష్టంపై ముఖ్యమంత్రి సర్వే కూడా చేయించలేదని జీవన్ రెడ్డి మండిపడ్డారు. రైతుల కష్టాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని అన్నారు. సన్నరకం వడ్లు వేసిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే రైతులకు మేలు చేయాలని అన్నారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోందని... ఇంత వరకు రైతు రుణమాఫీ చేయలేదని విమర్శించారు.
Jeevan Reddy
Congress
KCR
TRS

More Telugu News