Niharika Konidela: అన్నవరం సత్యదేవుని సన్నిధిలో సందడి చేసిన నిహారిక, చైతన్య... వీడియో ఇదిగో!

Niharika and Chaitanya offers special prayers at Annavaram shrine
  • ఇటీవలే నిహారిక, చైతన్యల పెళ్లి
  • రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వివాహ వేడుక
  • హైదరాబాదులో ఘనంగా రిసెప్షన్
  • అత్తామామలతో కలసి అన్నవరం వచ్చిన నిహారిక 
  • తరలివచ్చిన మెగా ఫ్యాన్స్
సినీ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక, గుంటూరు రేంజి మాజీ ఐజీ ప్రభాకర్ రావు తనయుడు చైతన్య జొన్నలగడ్డ ఈ నెల 9న పెళ్లితో ఒక్కటయ్యారు. తాజాగా నిహారిక, చైతన్య జోడీ అన్నవరం పుణ్యక్షేత్రంలో సందడి చేసింది.

 రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వీరి వివాహం జరిగింది. నిహారిక, చైతన్య, ప్రభాకర్ రావు దంపతులు ఇవాళ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం విచ్చేశారు. ఇక్కడి సత్యనారాయణ స్వామి సన్నిధిలో వ్రతం ఆచరించిన నూతన దంపతులు, ఆపై ప్రత్యేక పూజలు చేశారు.

నిహారిక, చైతన్య వచ్చారని తెలియడంతో మెగా ఫ్యాన్స్ అన్నవరం క్షేత్రానికి తరలివచ్చారు. మీడియా కూడా ఈ జోడీని కెమెరాల్లో బంధించేందుకు ఉత్సాహం చూపింది.  
Niharika Konidela
Chaitanya Jonnalagadda
Annavaram
Sathyanarayana Swami

More Telugu News