Woman: కళ్లు తిరిగి రైల్వే ట్రాక్ పై పడిపోయిన మహిళ.. కాపాడిన పోలీసు... వీడియో వైరల్

Railway police saves a woman life after she fell down on track
  • ముంబయిలో ఘటన
  • కుటుంబ సభ్యులతో ప్లాట్ ఫాంపై వేచి ఉన్న మహిళ
  • పట్టాలపైకి ఒరిగిపోయిన వైనం.. అదే సమయంలో రైలు రాక
  • తెగించి పట్టాలపైకి దూకిన కానిస్టేబుల్ శ్యామ్
  • మహిళను కాపాడి, ప్లాట్ ఫాంపైకి చేర్చిన కానిస్టేబుల్
ముంబయిలోని ఓ లోకల్ రైల్వే స్టేషన్ లో ఓ మహిళ కళ్లు తిరిగి పట్టాలపై పడిపోగా, ఓ రైల్వే పోలీసు వెంటనే స్పందించి ఆమెను కాపాడాడు. స్థానిక సంద్రుష్ట్ రోడ్ రైల్వే స్టేషన్ లో అనీషా షేక్ అనే మహిళ కుటుంబ సభ్యులతో కలసి రైలు కోసం వేచి ఉంది. ప్లాట్ ఫాంపై ఉన్న అనీషా కళ్లు తిరగడంతో తూలిపడుతూ వచ్చి రైలు పట్టాలపై పడిపోయింది. ఇది గమనించిన సహ ప్రయాణికులు కేకలు వేశారు. అంతలో పట్టాలపై ఓ రైలు వస్తుండడంతో చేతులు ఊపుతూ రైలును ఆపే ప్రయత్నం చేశారు.

అయితే, శ్యామ్ సూరత్ అనే రైల్వే పోలీసు వెంటనే స్పందించి ప్లాట్ ఫాంపై నుంచి పట్టాలపైకి దూకి అతి కష్టం మీద ఆ మహిళను తిరిగి ప్లాట్ ఫాంపైకి చేర్చారు. దాంతో పెనుప్రమాదం తప్పినట్టయింది. రైలు వస్తున్నా వెనుకాడకుండా మహిళను రక్షించిన కానిస్టేబుల్ శ్యామ్ సూరత్ ను అందరూ అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Woman
Railway Track
Police
Save
Mumbai

More Telugu News