వెబ్ సీరీస్ కి ఓకే చెప్పిన నాని?
- డిజిటల్ ఎంట్రీకి నాని గ్రీన్ సిగ్నల్
- ప్రస్తుతం 'టక్ జగదీశ్' సినిమా చేస్తున్న నాని
- లైన్లో 'శ్యామ్ సింగరాయ్', 'అంటే సుందరానికి'
- తర్వాత నెట్ ఫ్లిక్స్ వెబ్ సీరీస్ షూటింగ్
ఈ నేపథ్యంలో పలువురు తారలు ఇటు సినిమాలు చేస్తూనే... అటు ఓటీటీ సంస్థల కోసం వెబ్ సీరీస్ వంటివి చేస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు వీటితో బిజీగా వున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నిర్మించే ఓ వెబ్ సీరీస్ లో నాని ప్రధాన పాత్ర పోషించనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని 'టక్ జగదీశ్' సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలో పూర్తికానుంది. దీని తర్వాత 'శ్యామ్ సింగరాయ్' సినిమా చేస్తాడు. ఆ తర్వాత 'అంటే సుందరానికి' అనే సినిమా చేయాల్సివుంది. దాని తర్వాత నెట్ ఫ్లిక్స్ సీరీస్ షూటింగ్ చేస్తాడట.