Disha Patani: ప్రభాస్ 'సలార్'లో నాయికగా బాలీవుడ్ భామ!

  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ 'సలార్' 
  • ఫస్ట్ లుక్ కి అభిమానుల నుంచి స్పందన
  • బాలీవుడ్ భామ దిశా పథానితో సంప్రదింపులు
  • 15న హైదరాబాదులో ఇతర పాత్రలకు ఆడిషన్స్  
Bollywood star in Prabhas Salar

ప్రస్తుతం 'రాధే శ్యామ్' చిత్రంలో నటిస్తున్న హీరో ప్రభాస్ మరో మూడు కొత్త చిత్రాలను అంగీకరించిన సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి 'సలార్'. 'కేజీఎఫ్' సినిమాతో దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ కి అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.

ఇక ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారన్న విషయమై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో బాలీవుడ్ భామ దీపిక పదుకొణే నటించనుంది. అలాగే 'ఆదిపురుష్'లో కూడా బాలీవుడ్ భామనే ఎంపిక చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో 'సలార్'లో కూడా బాలీవుడ్ భామ నటించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందాలతార దిశా పథానితో సంప్రదింపులు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో దిశ తెలుగులో తొలిసారిగా 'లోఫర్' సినిమాలో నటించింది.

ఇదిలావుంచితే, ఈ చిత్రంలో ఇతర పాత్రలకు గాను హైదరాబాదులో ఆడిషన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 15న గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉదయం 9 నుంచి సాయంకాలం 6 వరకు ఈ ఆడిషన్స్ జరుగుతాయి. ఆసక్తిగల నటీనటులు ఆడిషన్స్ కు హాజరుకావచ్చు.

More Telugu News