తెలంగాణలో జనవరి రెండో వారం నుంచే కరోనా టీకాలు: వైద్య ఆరోగ్యశాఖ
- 80 లక్షల మందిని ఇప్పటికే గుర్తించాం
- 1.60 కోట్ల డోస్ లను సిద్ధం చేస్తున్నాం
- టీఎస్ ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు
జనవరి రెండో వారం నుంచి టీకాలు వేయటం ప్రారంభిస్తామని స్పష్టం చేసిన ఆయన, ఒక్కొక్కరికి రెండు డోసుల్లో టీకాలు వేయాలని కేంద్రం ఆదేశించిందని తెలిపారు. కరోనా నియంత్రణ టీకా 9 నుంచి 12 నెలల కాలం పనిచేస్తోందని తెలియజేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఉచితంగా టీకాల పంపిణీ జరుగుతుందని, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా వ్యాక్సిన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నామని డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.