నరేంద్ర మోదీపై ఒబామా అనుచిత వ్యాఖ్యల ట్వీట్ వైరల్.. చివరికి నకిలీదని తేలిన వైనం!
- వైరల్ అయిన ట్విట్టర్ స్క్రీన్ షాట్
- ఫేక్ ట్వీట్ అని తేల్చిన ట్విట్టరాటీలు
- ముందే తెలుసన్న పలువురు నెటిజన్లు
ఈ పోస్ట్ వైరల్ కాగానే దీనిలో ఎంత నిజముందన్న అనుమానాలు వ్యక్తం కాగా, ఈ ట్వీట్ ను ఫేక్ ట్వీట్ గా తేల్చారు. నరేంద్ర మోదీ గురించి ఒబామా ఎన్నడూ అలా మాట్లాడలేదని ట్విట్టర్ 'అడ్వాన్డ్స్ రీసెర్చ్' సెట్టింగ్స్ ను వాడిన ట్విట్టరాటీలు కనిపెట్టారు. టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా దీన్నే నిర్ధారించింది.
డిసెంబర్ 5న ఒబామా తన సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా స్క్రీన్ షాట్ చూపుతుండగా, అది నకిలీదని తేలింది. ఒకవేళ ఒబామా ఆ వ్యాఖ్యలు నిజంగా చేసివుంటే, అది అంతర్జాతీయ వార్తగా మారి ఉండేదని, దీన్ని చూడగానే ఇది ఫేక్ ట్వీట్ అనే భావించామని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు.