MK Stalin: తమిళరువి మణియన్ ను ఎందుకు నియమించుకున్నానా? అని రజనీకాంత్ బాధపడుతున్నట్టు తెలిసింది: స్టాలిన్

  • నూతన సంవత్సరంలో తలైవా రాజకీయ పార్టీ
  • రజనీ పొలిటికల్ ఎంట్రీపై స్టాలిన్ వ్యాఖ్యలు
  • పార్టీ ప్రకటించిన తర్వాత పూర్తిస్థాయిలో స్పందిస్తానన్న స్టాలిన్
  • సిద్ధాంతాలు తెలుకోవాల్సి ఉందని వెల్లడి
  • తమిళరువిపై రజనీ పునరాలోచనలో పడ్డారని వ్యాఖ్యలు
Stalin responds to Rajinikanth political entry

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ స్పందించారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చని, అయితే రజనీకాంత్ పార్టీ పెట్టిన తర్వాత దీనిపై పూర్తిస్థాయిలో మాట్లాడతానని స్పష్టం చేశారు. అసలు రజనీకాంత్ ను పార్టీని ప్రకటించనివ్వండి, ఆయన సిద్ధాంతాలేంటో తెలుసుకుని అప్పుడు స్పందిస్తాను అంటూ వివరించారు.

అయితే, తన రాజకీయ సలహాదారుగా తమిళరువి మణియన్ ను నియమించుకోవడంపై రజనీకాంత్ చింతిస్తున్నట్టు తెలిసిందని స్టాలిన్ పేర్కొన్నారు. తమిళరువిని ఎందుకు తెచ్చిపెట్టుకున్నానా అని రజనీకాంత్ పునరాలోచనలో పడ్డారని తెలిపారు. తన పార్టీ ఏర్పాటు, ఇతర కార్యాచరణ కోసం తమిళరువి మణియన్ ను రజనీకాంత్ నియమించుకోవడం తెలిసిందే. పార్టీ ఏర్పాటు క్రమంలో రజనీ ప్రకటించిన మొట్టమొదటి నియామకం ఇదే.

More Telugu News